లక్ష క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాలి: తహసీల్దార్
GNTR: పొన్నూరు మండలంలో లక్ష క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయాలని తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంలో రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 35 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. రైతులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనల మేరకు ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని మిల్లర్లకు ఆదేశించారు.