భారీ వర్షాలు.. 17 మంది మృతి

భారీ వర్షాలు.. 17 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 17 మంది మృతి చెందగా, 26 మందికి గాయాలయ్యాయి. 34 ప్రావిన్స్‌లపై ప్రభావం పడగా, 147 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 80 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.