దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం, గుర్తూరు, వెలికట్ట, కొమ్మనపల్లి తండాలో శనివారం అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి ధ్వంసమైన రోడ్లు, కల్వర్డులు, నీటమునిగిన పంటలను పరిశీలించారు. ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం లేకుండా రోడ్డు మరమ్మత్తులు చేయాలని అధికారులకు సూచించారు.