నేడు మండల సర్వసభ్య సమావేశం

ప్రకాశం: కొమరోలు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో చెన్నయ్య తెలిపారు. మండల ఎంపీపీ కామూరి అమూల్య అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొంటున్నారని, అధికారులు పూర్తి సమాచారంతో హాజరుకావాలని కోరారు.