26 గ్రామ పంచాయతీల్లో మూడో విడత నామినేషన్లు

26 గ్రామ పంచాయతీల్లో మూడో విడత నామినేషన్లు

KMM: వేంసూరు మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో మూడో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. రెండో రోజు 29 సర్పంచి, 116 వార్డ్ మెంబర్ నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో పోటీ తీవ్రమయ్యే అవకాశం ఉంది. మొత్తం రెండు రోజుల్లో 41 సర్పంచి, 148 వార్డ్ మెంబర్ నామినేషన్లు దాఖలయ్యాయి.