'ప్రహరిగోడ వద్దు అత్యాధునిక పాఠశాల భవనం ముద్దు'
SRD: "ప్రహరి గోడ వద్దు అత్యాధునిక పాఠశాల భవనం ముద్దు" అంటూ పటాన్ చెరువు ZPHS పూర్వ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. పూర్వ విద్యార్థి నాయకుడు రమేష్ మాట్లాడుతూ.. ZPHSలో చదివి, ఎదిగిన మేము పాఠశాల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అన్నారు. ప్రహరీగోడ పేరుతో కాలయాపన చేయడం తప్ప సమస్య పరిష్కారం కాదు అని అన్నారు. 100 కోట్ల CSR నిధులతో ఆధునిక పాఠశాల నిర్మించాలని కోరారు.