ప్రజలందరూ ఇంటి పన్ను చెల్లించాలి: ఎంపీవో
SDPT: ప్రజలందరూ తమ ఇంటి, ఆస్తి పన్నులను సక్రమంగా గ్రామపంచాయతీకి చెల్లించాలని కుకునూరుపల్లి మండలం ఎంపీవో సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఇంటి పన్ను సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. బాధ్యతగల పౌరులుగా ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు.