'సృజనాత్మకతకు ప్రాణం పోయండి'
KNR: కొత్తపల్లి ఓ పాఠశాలలో జరుగుతున్న బాల వైజ్ఞానిక మేళాకు అపూర్వ స్పందన లభిస్తుందని కరీంనగర్ డీఈవో శ్రీరాం మొండయ్య అన్నారు. అనుకరణతో కాకుండా, సృజనాత్మక ఆలోచనలతో ఆవిష్కరణలు చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు. రెండో రోజు 2,652 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా సైన్స్ అధికారి తెలిపారు.