భారీ బైక్ ర్యాలీతో ఆరోగ్యంపై అవగాహన
HYD: ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ జరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ జెండా ఊపి దీనిని ప్రారంభించారు. హాస్పిటల్ నుంచి కోకాపేట వరకు సాగిన ఈ ర్యాలీలో వైద్యులు, రైడర్లు పాల్గొని కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. సరైన జీవనశైలితో కిడ్నీ వ్యాధులను నివారించవచ్చని సీపీ పేర్కొన్నారు.