భారత్ తరఫున ఆడటం గొప్ప విషయం: కుల్‌దీప్
మూడు ఫార్మాట్లలో ఆడటం ఎంతో గొప్ప విషయమని టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ అన్నాడు. అయితే, టెస్టు క్రికెట్ అన్నింటికంటే ప్రత్యేకమైందని చెప్పాడు. ఇందులో ఆడటాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారని తెలిపాడు. ప్రతి ప్లేయర్ మూడు ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటారని చెప్పుకొచ్చాడు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడటం ఎంతో గర్వించదగ్గ విషయమని వెల్లడించాడు.