ఉమ్మడి జిల్లాలో పెరిగిన వార్డులు

ఉమ్మడి జిల్లాలో పెరిగిన వార్డులు

ప్రకాశం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 7 పురపాలక సంఘాల్లో వార్డుల సంఖ్య పెంపు జరిగింది. చీరాల 33 నుంచి 44కు, మార్కాపురం 35 నుంచి 40కు, కనిగిరి 28 నుంచి 32కు, అద్దంకి 27 నుంచి 32కు పెరిగాయి. అలాగే చీమకుర్తి, దర్శి, గిద్దలూరు పట్టణాల్లో ఒక్కో వార్డు చొప్పున పెంచి 28కు చేర్చారు. పెరిగిన ఓటర్ల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.