శ్రీలంకతో సిరీస్‌కు శ్రీచరణి, అరుంధతి

శ్రీలంకతో సిరీస్‌కు శ్రీచరణి, అరుంధతి

ఈనెల 21 నుంచి శ్రీలంకతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌కు భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. ఇందులో తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతి రెడ్డికి చోటుదక్కింది. భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమీమా, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా, షెఫాలి, అమన్‌జ్యోత్, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, క్రాంతి గౌడ్, రిచా ఘోష్, రేణుక సింగ్, వైష్ణవి శర్మ, కమలిని.