ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

KMM: ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఏన్కూరు మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హెచ్.పీ గ్యాస్ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న నూనావత్ ప్రేమ్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.