పిల్లలు కలగలేదని పురుగుల మందు ఆత్మహత్య..
MDK: మెదక్ మండలం మాచవరం గ్రామానికి చెందిన గంగాపురం ఎల్లయ్య (50) పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. 20 ఏళ్ల క్రితం లలితతో వివాహం కాగా పిల్లలు కలగలేదు. భార్య ఆరోగ్యం సైతం సరిగా లేకపోవడంతో అప్పులు చేసి వైద్యం చేయించారు. భార్య ఆరోగ్యం బాగు కాలేదు. విరక్తి చెందిన ఎల్లయ్య నిన్న పురుగుల మందు సేవించగా చికిత్స పొందుతూ..ఈరోజు మృతి చెందాడు.