VIDEO: ఎగబడ్డ జనం.. ఆటో నుంచి ఎత్తుకెళ్లిన సిలిండర్లు.!
HYD: నగరంలో గ్యాస్ ఆటో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఫిలింనగర్‌లోని షేక్‌పేట్ వద్ద గ్యాస్ ఏజెన్సీ వద్ద చోటుచేసుకుంది. సిలిండర్లతో బయటికి వచ్చిన ఆటో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు వినియోగదారులు ప్రయత్నించారు. దీంతో ఏజెన్సీ సిబ్బంది స్థానికుల సహాయంతో వారిని అడ్డుకున్నారు. గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా సిలిండర్ రాకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.