60 మంది హిజ్రాలకు కౌన్సెలింగ్
SRD: అమీన్ పూర్ పరిధిలోని 60 మంది హిజ్రాలకు ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. శుభకార్యాలు గృహప్రవేశాలు హిజ్రాలు ఎవరైనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టాలకు లోబడి ఉండాలని పేర్కొన్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.