జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు
అన్నమయ్య: ఢిల్లీలో జరిగిన పేలుళ్ల ఘటనల నేపథ్యంలో, జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం సోమవారం రాత్రి అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు, ప్రధాన రహదారుల వద్ద వాహన తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా ఉంచి, ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.