పరిశుభ్రతపై మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి

పరిశుభ్రతపై మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి

ATP: రాయదుర్గం పట్టణంలోని 5వ వార్డులో తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్చార్జి కడ్డిపూడి మహబూబ్ భాషాతో కలిసి మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి శానిటేషన్‌ని పరిశీలించారు. కాలువల్లో కొన్నిచోట్ల మురికి నిలబడడంతో వెంటనే మున్సిపల్ కార్మికులను అక్కడికి రప్పించి పరిశుభ్రత చేయించారు. వార్డుల్లో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సాధించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.