కలెక్టర్ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి

SRD: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ గంగను భూమి పైకి తీసుకువచ్చిన ఘనత భగీరథ మహర్షికి దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ పాల్గొన్నారు.