అగ్నిమాపక అధికారికి సేవా పురస్కారం

అగ్నిమాపక అధికారికి సేవా పురస్కారం

VZM: ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పురస్కారాల్లో ఎస్‌కోట అగ్నిమాపక కేంద్ర అధికారి ఎస్.కె మదీనాకు సేవా పురస్కారం వరించింది. ఈ సందర్భంగా శుక్రవారం ఎస్.కోట ఫైర్ స్టేషన్‌లో సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ పురస్కారం రావడం తనకు ఆనందంగా ఉందని, తన బాధ్యతను మరింత పెంచిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.