ఉద్యోగానికి రాజీనామా.. సర్పంచ్ బరిలో టీచర్
BHNG: మోటకొండూరు మండలం అమ్మనబోలు అంగన్వాడి కేంద్రం- 3 టీచర్ నాయిని అమరావతి (వసంత) సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. 18 ఏళ్లుగా కొనసాగిన అంగన్వాడి టీచర్ ఉద్యోగానికి ఆమె ఇటీవల రాజీనామా చేశారు. కొత్తగా ఏర్పడిన ఆబిద్ నగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆమె పోటీ చేస్తున్నారు.