లక్షలు ఖర్చు చేసి నిర్మించిన మండల కాంప్లెక్స్ ఖాళీగా..!
NZB: కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద లక్షలు పోసి నిర్మించిన మండల కాంప్లెక్స్ భవనం నిరుపయోగంగా మారింది. మండల పరిషత్ కార్యాలయానికి అదనపు ఆదాయం కోసం 2023 సంవత్సరంలో నాలుగు గదులతో కాంప్లెక్స్ భవనాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన నాటి నుంచి నేటి వరకు కాంప్లెక్స్ భవనంలోని నాలుగు గదులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.