పల్లె నివాసంలో శ్రీనివాస కళ్యాణం
సత్యసాయి: మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి నివాసంలో సోమవారం శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా పడాలని వారు భగవంతుడిని ప్రార్థించారు. కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.