గోదావరి నదినీ పరిశీలించిన సీపీ సాయిచైతన్య

NZB: మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాలకు గోదావరిలోకి ఉధృతంగా వరద వస్తోంది. దీంతో జిల్లాలోని కందకుర్తి, తదితర పుష్కర ఘాట్ల వద్ద వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈమేరకు CP సాయిచైతన్య సోమవారం సాయంత్రం ఆయా పుష్కరఘాట్లను పర్యవేక్షించారు. బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామ సమీపంలో కందకుర్తి గోదావరి వంతెనను CP సాయిచైతన్య పరిశీలించారు.