పెరిగిన టమాటా ధరలు.. రైతుల హర్షం వ్యక్తం

పెరిగిన టమాటా ధరలు.. రైతుల హర్షం వ్యక్తం

కూడేరు: పది రోజులుగా మార్కెట్లో టమాటా ధర పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం కిలో రూ.40 పలుకుతోంది. ఇన్ని రోజులూ కిలో రూ.10 లోపే ఉండేది. మండల వ్యాప్తంగా సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు. 15 కేజీల టమాట బాక్స్ ధర నాణ్యతను బట్టి రూ.300 నుంచి రూ.450 వరకు పలుకుతోంది. ధర పెరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.