ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్
జనగామ మండలం చౌడారం గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శనివారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. అలాగే, నాణ్యతలో రాజీ పడకుండా త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.