ATM మొరాయింపుతో ప్రజల ఇక్కట్లు..!
NDL: బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్.రంగాపురం గ్రామంలో గత రెండు వారాలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM పనిచేయడం లేదు. దీంతో నగదు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులు రూ.వెయ్యి విత్ డ్రాకు రూ.30 వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. బ్యాంక్ అధికారులు స్పందించి ATM పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.