ఘనంగా అజాద్ జయంతి వేడుకలు
PPM: మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయ సాధన దిశగా అందరూ నడుచుకోవాలని జాయింట్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అజాద్ జయంతి వేడుకలను కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ పాల్గొని అజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.