ఆర్ అండ్ బీ తీరుపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

ఆర్ అండ్ బీ తీరుపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

MBNR: షాద్ నగర్ ఆర్ అండ్ బీ అధికారుల పనితీరుపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల పేరుతో పట్టణంలోని సాయిబాబా గుడి ఎదురుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బక్కని ఇంటికి వెళ్లే రహదారిపై పెద్ద మొత్తంలో మట్టి వేయడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.