పుస్తకం తేలేదని చితకబాదిన టీచర్

HYD: బోరబండ పీఎస్ పరిధిలో ఒకటో తరగతి విద్యార్థిపై టీచర్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. గణిత పుస్తకం బదులు వేరే పుస్తకం తెచ్చాడని రియాన్ ఖాన్(6) అనే విద్యార్థిని తబస్సుం అనే ఉపాధ్యాయురాలు విచక్షణారహితంగా కొట్టింది. విద్యార్థి వీపుపై గాయాలయ్యాయి. ఈ ఘటనపై అమీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.