ఉప్పల్‌లో హత్యకు గురైన వ్యక్తి ఇతడే..!
MDCL: ఉప్పల్ చిల్కానగర్లోని సాయిబాబా దేవాలయం ఎదుట నిన్న ఓ వ్యక్తిని కిరాతకంగా నరికి చంపిన విషయం తెలిసిందే. అయితే, హత్యకు గురైన వ్యక్తి కర్నూలు జిల్లాకు చెందిన AR కానిస్టేబుల్ సుధీర్‌గా పోలీసులు గుర్తించారు. అతని పాత స్నేహితుడు, ఆటో డ్రైవర్ సంతోష్ నాయక్ కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. వాట్సాప్ చాటింగ్‌లో జరిగిన వివాదమే ఈ ఘాతుకానికి దారితీసినట్లు తెలిపారు.