పీడీఎస్ బియ్యం పట్టివేత

BHNG: రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన 54 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ సివిల్ సప్లై అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. వ్యవసాయ బావి వద్ద పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ సీఐ గౌస్, సివిల్ సప్లై డీటీ బాలమణిలు దాడులు చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.