VIDEO: దూసి స్టేషన్ అభివృద్ధిపై కీలక సమావేశం
SKLM: దూసి రైల్వే స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం రైల్వే స్టేషన్‌లో ఆదివారం సమావేశం జరిగింది. దూసి రైల్వే స్టేషన్ అభివృద్ధి, ప్రయాణికుల వసతులు, బొడ్డేపల్లి గేట్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం, పలు రైళ్లకు హాల్ట్ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం కమిటీ సభ్యులు, రైల్వే అధికారులు స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.