ఈనెల 16 నుంచి ధనుర్మాస ఉత్సవాలు
AKP: చోడవరం కేశవస్వామి ఆలయంలో ఈనెల 16వ తేదీ నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు ఎస్ సీతారామాచార్యులు ఆదివారం ఓ ప్రకటంలో తెలిపారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈనెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని వైభవంగా జరిపిస్తామన్నారు. 14న గోదాదేవి కల్యాణాన్ని నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.