మిద్దెపై నుంచి పడి వ్యక్తి మృతి

మిద్దెపై నుంచి పడి వ్యక్తి  మృతి

కడప: పెయింటింగ్ పని చేస్తూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి మిద్దెపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కడపలో చోటు చేసుకుంది. మృతుడు కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన ఓబులాపురం రాజశేఖర్‌గా పోలీసులు గుర్తించారు. కడపలోని రిమ్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి చనిపోవడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు.