104 వాహనాలసిద్ధం.. త్వరలో అందుబాటులోకి

104 వాహనాలసిద్ధం.. త్వరలో అందుబాటులోకి

కృష్ణా: బాపులపాడు(M) మల్లవల్లి పారిశ్రామికవాడలో 104 వాహనాలను 'సంజీవని' పేరుతో సిద్ధం చేస్తున్నారు. ఈ వాహనాలు త్వరలోనే మెరుగైన సదుపాయాలతో ప్రజల సేవలోకి రానున్నాయి. నీలం రంగును తొలగించి, తెలుపు రంగుతో పాటు ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు రంగులు, రిఫ్లెక్టివ్ టేపులు అమర్చారు. ఆధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఈ వాహనాలపై ప్రధాని, సీఎం, పవన్ కల్యాణ్ ఫొటోలు ఉండనున్నాయి.