VIDEO: పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం..!
KDP: ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 10 పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పులివెందుల పట్టణంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి 9 సెంటర్లలో 1,703 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షా కేంద్రాలకు 88 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఆయా సెంటర్లలో బెంచ్‌కు విద్యార్థుల హాల్ టికెట్ నంబర్లు వేయడంలో సిబ్బంది నిమగ్నమయ్యారు.