ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
KNR: కొత్తపల్లి మండలంలోని డీసీఎంఎస్ చింతకుంట ఫర్టిలైజర్ దుకాణాన్ని, గోదామును కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకం, నిల్వలు తనిఖీ చేశారు. ఎరువుల నిల్వ చేసిన గోదామును సందర్శించి ఎరువుల నిల్వ చేసే పద్ధతి, స్టోరేజ్ విధానం పరిశీలించారు.