VIDEO: పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో

VIDEO: పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో

కోనసీమ: ఈనెల 16 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలకు కోనసీమ జిల్లా నుంచి మొత్తం 19,310 మంది విద్యార్థులు హాజరు కానున్నారని డీఈవో నాగేశ్వరరావు తెలిపారు. మామిడికుదురు, నగరం జడ్పీహెచ్ స్కూల్స్‌ను ఆయన సోమవారం సందర్శించారు. రైజింగ్ స్టార్స్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. ప్రతి పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.