తప్పుడు ప్రచారం చేస్తున్నారు: ఎమ్మెల్యే

ప్రకాశం: తిరుపతిలో గోవుల మరణించాయని జరుగుతున్న ప్రచారాన్ని సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కోట్లాదిమంది ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు, మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.