బాలింతకు అండగా నిలిచిన 108 సిబ్బంది
PDPL: రామగిరి మండలం బేగంపేటలో పురిటినొప్పులతో బాధపడుతున్న బాలింత గోవిందుల మౌనిక (28)కు 108 సిబ్బంది అండగా నిలిచారు. కుటుంబ సభ్యుల సమాచారంతో హుటాహుటిన చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది, నొప్పులు తీవ్రతరం కావడంతో ఇంటి వద్దే ప్రసవం చేశారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఎన్. శ్రీనివాస్ నేతృత్వంలో డెలివరీ విజయవంతమైంది. మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.