'సైబర్ నేరేల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SRCL: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చందూర్తి ఎస్సై రమేష్ తెలిపారు. చందూర్తి మండలంలోని కిష్టంపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సీసీ కెమెరాలపై ,డయల్ 100 వినియోగం, మహిళా భద్రత, సైబర్ భద్రతా సూచనలు, 1930 సైబర్ హెల్ప్‌లైన్, సంచార్ సాథి వెబ్‌పోర్టల్, అంశాలను అవగాహన కల్పించారు.