సుగాలిమెట్టలో జలధార పనుల ప్రారంభం

సుగాలిమెట్టలో జలధార పనుల ప్రారంభం

NDL: పాణ్యం మండలం సుగాలిమెట్టలో జలధార–జలహారతి పనులను మంత్రి ఎన్‌.ఎం.డి. ఫరూక్, కలెక్టర్ రాజకుమారి ఇవాళ ప్రారంభించారు. భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణగా అమలు చేస్తోందని తెలిపారు. సాగునీటి సంఘాలు సమన్వయంతో పని చేసి నీటి వనరులను సంరక్షించాలని సూచించారు. నీటి భద్రతపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు.