పరిశుభ్రతలో రాజీపడే ప్రసక్తే లేదు: కలెక్టర్

NTR: ప్రయాణికుల భద్రత, బస్టాండు పరిశుభ్రతలో రాజీపడే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాట్‌ఫాంలతో పాటు తాగునీటి పాయింట్లు, మరుగుదొడ్ల పరిసరాలను పరిశీలించారు. ఏ సమయంలోనైనా అపరిశుభ్రత అనే మాట వినిపించకూడదని సిబ్బందికి తెలిపారు.