ఉపాధి హమీ కూలీలకు GOOD NEWS

TG: పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి హామీ పనులు ఉదయం, సాయంత్రం మాత్రమే నిర్వహించాలని అధికారులకు సూచించింది. వేసవి తీవ్రత దృష్ట్యా కూలీలకు వడదెబ్బ తగలకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పని సమయాల్లో త్రాగునీటి సౌకర్యం, కూలీల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది.