కుడకుడ రోడ్డుకు మోక్షం ఎప్పుడు..?
SRPT: సూర్యాపేటలో నిత్యం రద్దీగా ఉండే కుడకుడ రోడ్డును నాలుగు లైన్లుగా మార్చాలని CPM(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా నిర్వహించారు. సూర్యాపేట కొత్త బస్టాండ్ నుంచి దంతాలపల్లి వరకు ఉన్న రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుగా నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు.