వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కిరణ్ కుమార్ రెడ్డి
నెల్లూరు: జిల్లా వైసీపీ పంచాయతీరాజ్ విభాగ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కోవూరుకు చెందిన పలగాని కిరణ్ కుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, నియామకానికి సహకరించిన నాయకులు, కార్య కర్తలకు ధన్యవాదాలు తెలిపారు.