న్యుమోనియా దినోత్సవం గోడపత్రిక ఆవిష్కరణ
VZM: ప్రపంచ న్యుమోనియా దినోత్సవం సందర్బంగా బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.ఎస్. జీవన రాణి ఆమె కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు. పిల్లల మరణానికి ప్రధాన కారణాలలో న్యుమోనియా ఒకటన్నారు. జలుబు, దగ్గు, జ్వరం, వేగంగా శ్వాస తీసుకోవడం ఈ లక్షణాలు కనిపించిన వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి చికిత్స తీసుకోవాలన్నారు.