భద్రాద్రిలో వైభవంగా నిత్య కళ్యాణం
BDK: భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్య కళ్యాణ వేడుక శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. తెల్లవారుజామునే ఆలయ ద్వారాలను తెరిచిన అర్చకులు, స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించారు. అనంతరం బేడ మండపంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం గావించి, వేద మంత్రాల సాక్షిగా సీతారాముల పరిణయ వేడుకను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.