కిరాణం దుకాణంలో చోరీ
ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ తండాలో బానోత్ శంకర్‌కు చెందిన కిరాణంలో ఈనెల 23న రాత్రి చోరీ జరిగింది. సీఐ బాలాజీ వరప్రసాద్ కథనం ప్రకారం.. యజమాని సోమవారం ఉదయం వచ్చి చూసేసరికి దుకాణం షట్టర్ కింద నేల ధ్వంసం చేసుంది. రూ.5వేల నగదుతో పాటు రూ.10 వేల విలువైన సామాగ్రిని దొంగిలించినట్లు యజమాని గుర్తించారు.